గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 మార్చి 2018 (15:39 IST)

కేంద్ర మంత్రి (టీడీపీ) రాజీనామా... తెలంగాణ మంత్రి మనస్తాపం

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు తీవ్ర మనస్తాపం చెందారు. ఆ మంత్రి ఎవరో కాదు.. కేటీఆర్ (కె. తారక రామారావు).

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు తీవ్ర మనస్తాపం చెందారు. ఆ మంత్రి ఎవరో కాదు.. కేటీఆర్ (కె. తారక రామారావు). రాజీనామా చేసిన కేంద్ర మంత్రి పి.అశోకగజపతి రాజు. ఏపీకి విభజన హామీల అమలులో కేంద్రం చేతులెత్తేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీకి చెందిన అశోకగజపతి రాజు, సుజనా చౌదరిలు రాజీనామాలు చేయనున్నారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వయంగా కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. 
 
అయితే, ఈ రాజీనామా వార్తలను తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అశోకగజపతి రాజు రాజీనామా చేశారన్న వార్తను ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
హైదరాబాదులోని బేగంపేటలో నిర్వహించిన వింగ్స్ ఇండియా సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సదస్సులో అశోకగజపతి రాజు పాల్గొనాల్సి ఉంది. అయితే, కానీ ఆయన గైర్హాజరయ్యారు. ఆయన స్థానంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా వ్యవహరించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అశోకగజపతి రాజు సదస్సుకు హాజరుకాలేకపోయారని, దీంతోనే తాను ముఖ్యఅతిథిగా వ్యవహరించాల్సి వచ్చిందని తెలిపారు.
 
పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో 70 యేళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే, అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలో 50 నుంచి 60కిపైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమని చెప్పిన ఆయన, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని అన్నారు.