ఆ స్కూలులో బాత్రూమ్ కూడా లేదు.. ప్రదీప్ ట్వీట్.. కేటీఆర్ స్పందన
డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి జరిగేలా చూశాడు. తద్వారా తన మంచి మనసును చాటుకున్నాడు. బాలికలు పాఠశాలలో ఎదుర్కొనే ప్రధాన సమస్యను పరిష్కరించాలని మం
డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి జరిగేలా చూశాడు. తద్వారా తన మంచి మనసును చాటుకున్నాడు. బాలికలు పాఠశాలలో ఎదుర్కొనే ప్రధాన సమస్యను పరిష్కరించాలని మంత్రి కేటీఆర్‌ను విజ్ఞప్తి చేశాడు.
ఇంతకీ ప్రదీప్ కేటీఆర్‌కు ఏం వినతి చేశారంటే.. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం చర్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరించారు. ఆ పాఠశాలలో బాలికలకు బాత్రూమ్ కూడా లేదని.. మంచి నీటి సదుపాయం లేదని ప్రదీప్ సమస్యలను ఎత్తి చూపారు.
ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ పాఠశాల విద్యార్థుల సమస్యలను తప్పకుండా తీర్చుతామని ట్వీట్ చేసి హామీ ఇచ్చారు. మేడ్చల్ కలెక్టర్ ఈ విషయంలో వెంటనే స్పందించాలని.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక మంత్రి కేటీఆర్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రదీప్ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.