శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:09 IST)

అనసూయ ఫోన్‌ను పగులకొట్టింది.. నేను కళ్లారా చూశాను

యాంకర్ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను విడిచిపెట్టేలా కనిపించట్లేదు. హైదరాబాద్ నగరంలో తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో ఓ బాలుడు ఆమెతో స

యాంకర్ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను విడిచిపెట్టేలా కనిపించట్లేదు. హైదరాబాద్ నగరంలో తార్నాక సమీపంలో నటి, యాంకర్ అనసూయను చూసిన ఆనందంలో ఓ బాలుడు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఫోనును అనసూయ కోపంతో పగులకొట్టినట్లు బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ వ్యవహారంపై అనసూయ ట్విట్టర్లో స్పందించింది. సెల్ఫీ దిగే పరిస్థితుల్లో తాను లేనని క్లారిటీ ఇచ్చి.. కారులోకి ఎక్కానని.. ఆ పిల్లాడి చేతిలో వున్న ఫోన్ పగిలిందా? లేదా? అనేది తనకు తెలియదని చెప్పింది. అయితే ఓ యువకుడు అనసూయను, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. బాలుడి ఫోన్‌ను ఎందుకు పగులగొట్టావ్? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. ఆ సమయంలో తాను అక్కడే వున్నానని కూడా చెప్పాడు. 
 
ఇంకేముంది? ఆ యువకుడి ట్వీట్‌కు స్పందించిన హైదరాబాద్ పోలీసులు పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగారు. సదరు యువకుడి నుంచి సమాచారాన్ని సేకరిస్తామని కూడా పోలీసులు తెలిపారు. దీంతో ఫోన్ పగుల కొట్టిన వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది.