బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (09:08 IST)

డియర్ ఇండియా.. స్వేచ్ఛకు అర్థం ఇదా? అనసూయ ప్రశ్న

బుల్లితెర యాంకర్ అనసూయ. ఓ యాంకర్‌గానే కాకుండా అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ, కుర్రకారును హుషారెత్తిస్తోంది. ముఖ్యంగా, ఈమె వస్త్రధారణపై పలువురు పలురకాలైన కామెంట్స్ చేస్తున్నారు.

బుల్లితెర యాంకర్ అనసూయ. ఓ యాంకర్‌గానే కాకుండా అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తూ, కుర్రకారును హుషారెత్తిస్తోంది. ముఖ్యంగా, ఈమె వస్త్రధారణపై పలువురు పలురకాలైన కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు ఏకంగా అసభ్యంగా మొబైల్ సందేశాలను కూడా పెడుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఆమె ఘాటైన ట్వీట్ చేసింది. ఓపక్క అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెబుతూ.. మరోపక్క కొందరు తనను కించపరిచే మాటలతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. 
 
'డియర్ ఇండియా.. ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. మిగతా అందరిలా నా కుటుంబం కోసం నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. నేను చేసే పని, ధరించే దుస్తులు నా కుటుంబాన్ని ఏ విధంగానూ ఇబ్బంది కల్గించడం లేదు. కానీ, ఇతరులు మాత్రం స్పందిస్తున్నారు.. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని కొందరు నన్నే కాదు, నా భర్తను, పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని దూషిస్తున్నారు, అమర్యాదగా, అగౌరవంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్‌తో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇది తెలుసుకునే శక్తి కూడా మీకు లేదు. బాధ్యత కలిగిన ఓ మహిళగా, రిపబ్లిక్ డే నాడు నేను ప్రశ్నిస్తున్నాను.. స్వేచ్ఛకు అర్థం ఇదా? నేను కోరుకున్న పనిని చేసుకునే స్వేచ్ఛ నాకు లేదా? సంస్కృతీసంప్రదాయాల పేరిట నా భావాలను, గౌరవాన్ని అణగదొక్కే స్వేచ్ఛ ఈ గూండాలకు ఉందా? ఇక, ఇలాగే జీవించాలా?? ఏమీ చేయలేమా??' అంటూ అనసూయ తన ఆవేదనను వెళ్లగక్కింది.