సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 7 డిశెంబరు 2017 (14:22 IST)

శవాన్ని రేప్ చేయడం అని చెప్పగానే అనసూయ అలా అంది... ధనరాజ్

ఇటీవలే ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ చిత్రం శవాన్ని రేప్ చేయడమనే పాయింటుతో ముందుకు వచ్చింది. చనిపోయిన యువతి పాత్రలో పూజా రామచంద్రన్ నటించింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిత్రం గురించి ధనరాజ్ పలు

ఇటీవలే ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ చిత్రం శవాన్ని రేప్ చేయడమనే పాయింటుతో ముందుకు వచ్చింది. చనిపోయిన యువతి పాత్రలో పూజా రామచంద్రన్ నటించింది. ఈ చిత్రానికి సినీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇకపోతే చిత్రం గురించి ధనరాజ్ పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
 
తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టరుకి యాంకర్ అనసూయను సంప్రదించామన్నారు. ఆమె తనకు కథ చెప్పమనగానే... ఈ చిత్రంలో ఓ హీరోయిన్ వుంటుందనీ, ఓ ప్రమాదంలో ఆమె చనిపోతే, ఆమె శవాన్ని మార్చురీలో పెడతారు. ఈ శవంపై అత్యాచారం చేస్తారు... అని చెప్పగానే, అనసూయ కాస్త షాక్ తిన్నదట. ఈ చిత్రంలోని పాత్రలో నటిస్తే తన ఆడియెన్సుకు దూరమవుతానని ఫీలై రిజెక్ట్ చేసిందట. ఐతే తను నటించనని మామూలుగానే చెప్పేసిందనీ, అలాగే చిత్రం తీస్తున్నందుకు బెస్ట్ విషెస్ చెప్పినట్లు వెల్లడించాడు ధనరాజ్.