బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 4 అక్టోబరు 2017 (15:30 IST)

హవ్వా.. అనసూయ అలా చేసేందుకు సిద్ధమైంది...

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఒక ఐటంసాంగ్‌లో కూడా నర్తించింది. కానీ ఆ తరువాత కాస్త అవకాశాలు తగ్గాయి. అవకాశం తగ్గాయని ఏకంగా అత్త క్యారెక్ట

అనసూయ. బుల్లితెరపై హాట్ యాంకర్. నాగార్జునతో కలిసి జతకట్టిన తరువాత అనసూయకు అవకాశాలు మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ఒక ఐటంసాంగ్‌లో కూడా నర్తించింది. కానీ ఆ తరువాత కాస్త అవకాశాలు తగ్గాయి. అవకాశం తగ్గాయని ఏకంగా అత్త క్యారెక్టర్‌కే సిద్ధమైపోయింది అనసూయ. అది కూడా మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌కు మేనత్తగా. 
 
ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఇదే హాట్ టాపిక్. రామ్ చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న రంగస్థల సినిమాలో రామ్ చరణ్‌కు మేనత్తగా అనసూయ కనబడుతోంది. ఇప్పటికే షూటింగ్‌ జరుగుతున్న ఈ సినిమాలో కీ రోల్ మేనత్త పాత్రే. పాత్రకు మంచి మైలేజ్ ఉండటంతో ఇక అనసూయ ఆ క్యారెక్టర్ కూడా చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పటికే మరదలు క్యారెక్టర్‌లోను, హీరోయిన్‌ను బంధువుగాని చేసిన అనసూయ ఒక్కసారిగా మేనత్తగా నటిస్తుండటం అభిమానులకు ఏ మాత్రం ఇష్టం లేదట.
 
అయితే అనసూయ మాత్రం అభిమానులకు ఒక్కటే చెబుతోంది. ఈ సినిమా విడుదలైన తరువాత ఆ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌లో మీకు అర్థమవుతుంది. కాస్త ఓపిక పట్టండి. సినిమా ఛాన్సులు లేక కాదు. క్యారెక్టర్ మంచిది.. అందులోను రామ్ చరణ్‌కు అత్త క్యారెక్టర్ చాలా బాగుంటుందని అందరినీ సముదాయించే ప్రయత్నం చేస్తోందట అనసూయ. అవకాశాలు రాలేదనే అనసూయ ఇలాంటి క్యారెక్టర్లు చేస్తోంది తెలుగు సినీపరిశ్రమలో చెవులు కొరుక్కుంటున్నారు.