బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (14:08 IST)

టాప్ హీరోయిన్ల జాబితాలో అనసూయ..

ఏంటిది.. అనసూయ ఏంటి టాప్ హీరోయిన్లు జాబితాలోకి వెళ్ళడమేంటి అనుకుని.. కన్ఫ్యూజ్ అవుతున్నారా?. ఏమీ లేదండి.. అనసూయ హీరోయిన్‌గా సినిమాలు తీసేందుకు దర్శకులు సిద్ధమైపోయారు.

ఏంటిది.. అనసూయ ఏంటి టాప్ హీరోయిన్లు జాబితాలోకి వెళ్ళడమేంటి అనుకుని.. కన్ఫ్యూజ్ అవుతున్నారా?. ఏమీ లేదండి.. అనసూయ హీరోయిన్‌గా సినిమాలు తీసేందుకు దర్శకులు సిద్ధమైపోయారు. 'జబర్థస్త్' కామెడీ షోతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువైన అనసూయ అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో కనిపించిన అనసూయకు ఏకంగా హీరోయిన్ అవకాశమే వచ్చింది.
 
శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చచ్చిందిరా గొర్రె సినిమాలో అనసూయ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెట్స్‌పైకి ఈ సినిమా వెళ్ళిపోయింది. 'జబర్థస్త్' టీంలోని కొంతమంది ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా మొత్తం కామెడీ ఉండే విధంగానే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా పూర్తయి విడుదలైతే ఖచ్చితంగా తాను టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోతానని అనసూయ నమ్మకంగా చెపుతోంది. 
 
మరో రెండు సినిమాల్లోనూ అవకాశాలొచ్చాయని, యువ హీరోలతో త్వరలో నటించబోతున్నట్లు అనసూయ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమా షూటింగ్ జరుగుతుండగానే తాను టాప్ హీరోయిన్‌ల స్థానంలో నిలబడతానని అనసూయ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.