ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2017 (18:33 IST)

షాలిని అలాంటిదా...? ఆశ్చర్యపోతున్న సినీపరిశ్రమ...!

తెలుగు సినీపరిశ్రమలో ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమాపై చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమాలోని హీరోయిన్ షాలిని పాండే గురించి కూడా అదేస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపించారు. శివ తరువాత అర్జున్ రెడ్డి సినిమానే ఒక ట

తెలుగు సినీపరిశ్రమలో ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమాపై చర్చ జరుగుతూనే ఉంది. ఆ సినిమాలోని హీరోయిన్ షాలిని పాండే గురించి కూడా అదేస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాపై చాలామంది సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపించారు. శివ తరువాత అర్జున్ రెడ్డి సినిమానే ఒక ట్రెండ్ సెట్టర్ అంటున్నారు సినీఅభిమానులు. సినిమా సక్సెస్ పై షాలిని మీడియాతో మాట్లాడింది. ఆమె మాట్లాడిన మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
 
తెలుగు సినీపరిశ్రమలోకి రావాలంటే ఎంత కష్టమో తెలుసా.. అంటూ మీడియాను ప్రశ్నించింది. మధ్యప్రదేశ్‌ లోని జబల్ పూర్ సిటీకి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె షాలిని. ఇంజనీరింగ్ చదివే సమయంలో చదువు మధ్యలోనే ఆపి సినిమా రంగంలోకి వెళ్ళాలని భావించింది షాలిని. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో చదువును పూర్తి చేసింది. థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది షాలిని. నటనలో ప్రతిభ చూపినా తండ్రికి మాత్రం ఏమాత్రం షాలిని సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించేసుకుంది షాలిని.
 
ముంబైలో స్నేహితురాలి ఇంటికి వెళ్ళివస్తానని చెప్పి ఇంటికే వెళ్ళలేదు. షాలిని తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో షాలిని తాను మేజర్‌ను తనను బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తే కేసు పెడతానంటూ హెచ్చరించింది. దీంతో తండ్రి నువ్వు ఇంటికెప్పుడూ రావద్దంటూ వెళ్ళిపోయారు. అయినా సినిమా ఛాన్సుల కోసం షాలిని రకరకాల ప్రయత్నాలు చేసింది. 
 
డబ్బులు లేకపోవడంతో చిన్న గదిలో అద్దెకు ఉంటూ తినడానికి తిండి కూడా లేని దీనస్థితిలోకి వెళ్ళిపోయిందట షాలిని. అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం లభించిందట. సినిమా షూటింగ్‌కు రెండు నెలల సమయం ఉందట. అప్పటికే షాలిని దగ్గరున్న డబ్బులు అయిపోయాయట. తనకు తెలిసిన స్నేహితులు (బాయ్స్) ఉన్న గదిలోనే అప్పుడు కలిసి ఉందట షాలిని. అలా ఎన్నో బాధలు పడి చివరకు తెలుగులో హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ విషయం మొత్తాన్ని షాలినీనే స్వయంగా రెండురోజుల క్రితం ఒక జ్యువెలరీ ప్రారంభోత్సవంలో మీడియాకు తెలిపింది. 
 
అంతకుముందు ఒక్కసారి ఈ విషయాన్ని చెప్పినా పెద్దగా పట్టించుకోని మీడియా రెండవసారి ఆమె అలాగే చెప్పడంతో తెగ ప్రసారాలు చేసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోను షాలిని జీవిత చరిత్రపై రాసేస్తున్నారు. ఈ సినిమాను తన తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసే ఉంటారు.. వారి మనస్సు మారి తనను ఎప్పటికైనా ఇంటికి తీసుకెళతారన్న నమ్మకంలో ఉన్నారట షాలిని. మరి ఇన్ని కష్టాలు పడ్డ షాలిని తల్లిదండ్రుల వద్దకు చేరాలని మనమూ కోరుకుందాం.