ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (16:47 IST)

నాకేం కాలేదు.. ఆరోగ్యంగానే ఉన్నా.. మహానటిలో నటిస్తున్నా: షాలినీ పాండే (వీడియో)

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే నెల్లూరులో అస్వస్థత గురైయ్యారు. నెల్లూరులో ఓ సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్లిన షాలినీ.. అక్కడ అస్వస్థతకు గురవడంతో నగరంలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్

‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే నెల్లూరులో అస్వస్థత గురైయ్యారు. నెల్లూరులో ఓ సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి వెళ్లిన షాలినీ.. అక్కడ  అస్వస్థతకు గురవడంతో నగరంలోని బొల్లినేని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. చికిత్స అనంతరం గంట తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆమె బాగానే వున్నారని వార్తలొచ్చాయి. 
 
అయితే ఆసుపత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసే సమయంలో స్ట్రైచర్‌పై తీసుకురావడం, ఆమె ముఖం కనిపించకుండా తెల్లటి వస్త్రంతో శరీరమంతా కప్పి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీంతో అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి తనకు ఏం కాలేదని, బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.
 
ఈ రోజు ఉదయం జ్వరం, తలనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లానని, చికిత్స అందుకున్నాక ఆరోగ్యం బాగుందని చెప్పారు. తనకు కొత్త అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుతం ‘మహానటి’లో నటిస్తున్నానని వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందొద్దని అభిమానులకు సూచించారు.