గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:08 IST)

షాలిని పాండే బెస్ట్.. అన్ని విధాలా పనికొస్తుందట...

టాలీవుడ్ యువ హీరో నాగ చైత‌న్య‌ - త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "100% ల‌వ్". ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేయాల‌న

టాలీవుడ్ యువ హీరో నాగ చైత‌న్య‌ - త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కించిన చిత్రం "100% ల‌వ్". ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల‌లో రీమేక్ చేయాల‌ని అప్ప‌ట్లో చాలా ప్ర‌య‌త్నాలే జరిగాయి. చివరకు తమిళంలో మాత్రం సుకుమార్ శిష్యుడైన చంద్ర‌మౌళి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో జీవి.ప్ర‌కాశ్ కుమార్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్నాడు. ఆ మ‌ధ్య ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. అయితే కొద్ది రోజులుగా చిత్ర హీరోయిన్ విష‌యంలో సందిగ్ధ నెలకొంది. తొలుత హెబ్బా ప‌టేల్‌ని హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకోగా, ఆ త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి ఫ్రేమ్‌లోకి వ‌చ్చింది. ఈ అమ్మ‌డు పెద్దగా ఆసక్తి చూపించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలిని పాండేని రీమేక్‌లో హీరోయిన్‌గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 
 
అర్జున్ రెడ్డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన షాలిని ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటుంది. పైగా, అర్జున్ రెడ్డి చిత్రంలో ముద్దుసీన్లలో షాలిని నటన పండిపోయిందనే, ఆమె అయితే అన్నింటికీ బాగా ఉంటుందన్నది చిత్ర యూనిట్ టాక్. అందుకే దర్శకుడు ఆమెను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.