1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 5-Year-Old Boy Found Dead in Uppal

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

crime
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయనుకుంటే.. బాలురపై కూడా దారుణ ఘటనలు జరుగుతున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. హైదరాబాదులో ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. ఆపై హత్య జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచ‌ల‌నంగా మారింది. 
 
ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామాంతపూర్‌లో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
దర్యాప్తులో బాధిత‌ కుటుంబానికి స‌మీపంలో ఉంటున్న‌ బీహార్‌కు చెందిన కమర్ ఈ ఘటనకు కారణమని తెలిసింది. దీంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచార‌ణ‌లో అసలు విషయం బయటపడింది.
 
బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల‌కు వెల్లడించాడు. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి కమర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
స్థోమతకు తగిన హోటల్ విభాగం లోనికి రెడ్‌బస్ అడుగు