బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (12:40 IST)

కంగనాకు సోనా బహిరంగ లేఖ.. కౌంటరిచ్చిన కంగనా సోదరి రంగోలి...

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి పై ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్‌లపై తనకున్న వైరం గురించి ప్రస్తావించింది. ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణం కొట్టేవ

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి పై ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య పంచోలి, హృతిక్ రోషన్‌లపై తనకున్న వైరం గురించి ప్రస్తావించింది. ఆదిత్య పంచోలి తనను చిన్నప్పుడు దారుణం కొట్టేవాడని కంగనా కామెంట్స్ చేసింది. దీనిపై పంచోలి ఆమెపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.

అలాగే హృతిక్ రోషన్, కంగనా కొద్దికాలం ప్రేమలో ఉండి ఆ తర్వాత విడిపోయారు. దీనిపై కూడా కంగనా స్పందించింది. మా ఇద్దరి ప్రేమ వ్యవహారంలో కూడా ఆదిత్య.. హృతిక్‌కే మద్దతు పలకడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్‌లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది.
 
ఈ నేపథ్యంలో కంగనా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌‌లో పెద్ద చర్చను లేవదీశాయి. ఈ క్రమంలో సింగర్ సోనా మహాపాత్ర కంగనా రనౌత్‌కు బహిరంగ లేఖ రాసింది. సిమ్రన్ సినిమా ప్రచార కార్యక్రమాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావంటూ ఆ లేఖలో సోనా ఫైర్ అయ్యింది. ఇది సబబు కాదంది. దీనిని కంగనా పట్టించుకోలేదు కానీ, ఆమె సోదరి రంగోలీ ట్విటర్‌ వేదికగా సోనాపై ధ్వజమెత్తింది. 
 
ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తున్న అభిప్రాయాలను సర్కస్ అని వ్యాఖ్యానించకు. మనుషుల జీవితాలు  వారి ప్రయాణాలు సినిమాలపై ఆధారపడి వుండవు. నువ్వు మహిళా లోకానికే మాయని మచ్చవి అంటూ ఫైర్ అయ్యింది. నీలాంటి వాళ్లే పబ్లిసిటీ కోసం ఇలాంటి విషయాలపై స్పందిస్తుంటారని తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ పోస్టర్లపై ప్రస్తుతం నెటిజన్లు విభిన్నాభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు.