శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 27 డిశెంబరు 2017 (14:32 IST)

యాంకర్ అనసూయ భర్త కూడా వస్తానంటున్నాడట...

యాంకర్ అనసూయ పేరు చెబితే అదో ఆసక్తిగా చూస్తుంటారు యువత. యాంకరింగ్‌లో తనదైన స్టయిల్‌ను క్రియేట్ చేసిన అనసూయ జబర్దస్త్ షోతో ఇంకా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆడియో వేడుకలకు హోస్టుగానూ, వెండితెరపై అడపాదడపా పాత్రల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించింది. సోగ్గాడే చిన్

యాంకర్ అనసూయ పేరు చెబితే అదో ఆసక్తిగా చూస్తుంటారు యువత. యాంకరింగ్‌లో తనదైన స్టయిల్‌ను క్రియేట్ చేసిన అనసూయ జబర్దస్త్ షోతో ఇంకా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆడియో వేడుకలకు హోస్టుగానూ, వెండితెరపై అడపాదడపా పాత్రల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించిన అనసూయ ఇప్పుడు చెర్రీ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా " సచ్చింది గొర్రె'' అనే చిత్రంలోనూ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోందట. 
 
అనసూయకు ఇద్దరు పిల్లలు. ఆ పిల్లలను అనసూయ భర్త ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ అనసూయ కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు సాయపడుతున్నారు. ఐతే అనసూయ యాక్టింగ్ చూశాక ఆమె భర్త సుశాంక్ కూడా యాక్ట్ చేయాలనే కోరిక కలిగిందట. 
 
భర్త తన మనసులోని మాట చెప్పగానే అనసూయ ఇక ఎంతమాత్రం ఆలస్యం చెయ్యకుండా తనకున్న పరిచయాలతో భర్తను నటుడిగా చేయాలని నిశ్చయించుకున్నదట. మరి ఎలాంటి క్యారెక్టర్ చేస్తాడో కానీ త్వరలో అనసూయ భర్త కూడా అంజలా ఝవేరి భర్తలా నటుడి అవతారం ఎత్తుతారన్నమాట.