మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (10:25 IST)

నీవంటే నాకిష్టంలేదు.. అతన్ని ప్రేమిస్తున్నానన్న భార్య.. సూసైడ్ చేసుకున్న భర్త

ఇటీవలి కాలంలో భార్యలు పెట్టే చిత్ర హింసలు తాళలేక అనేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు వివాహితులు అయితే, పెళ్లన తర్వాత తమ పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ప్రియుడితో లేచిపోతున్నారు.

ఇటీవలి కాలంలో భార్యలు పెట్టే చిత్ర హింసలు తాళలేక అనేక భర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు వివాహితులు అయితే, పెళ్లన తర్వాత తమ పాత ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని ప్రియుడితో లేచిపోతున్నారు. తాజాగా ఓ వివాహిత ఇలాంటి ప్రతిపాదనే చేసింది. నీవంటే నాకిష్టం లేదు.. అతన్ని ప్రేమిస్తున్నానని భర్తకు చెప్పింది. అంతే ఆ భర్త గుండె ఆగిపోయినంత పని అయింది. భార్య చెప్పిన మాటలను జీర్ణిచుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పానిపట్‌కు చెందిన సాహిల్ - శివానీ అనేవారికి ఒక యేడాది క్రితం వివాహమైంది. ఆరు నెలల పాటు సంసారం సాఫీగా సాగిన తర్వాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో శివానీ జమ్మూకాశ్మీర్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సాహిల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఆత్మహత్యకు ముందు సాహిల్ పది పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అందులో తన భార్య పెట్టిన చిత్రహింసలను పూసగుచ్చినట్టు వివరించాడు. ముఖ్యంగా శివానీ పెళ్లికి ముందు నుంచే మరోవ్యక్తిని ప్రేమిస్తున్నట్టు చెప్పిందనీ, అతడితోనే తాను ఉంటానని చెప్పిందని పేర్కొన్నాడు. 
 
సూసైడ్ నోట్ ప్రారంభంలోనే ‘శివానీ కిల్ మీ’ అని రాశాడు. తన ఉద్యోగాన్ని, డబ్బులను సోదరుడికి ఇవ్వాలని లేఖలో అభ్యర్థించిన సాహిల్, తాను తిరిగి జన్మిస్తానని తల్లిని ఉద్దేశిస్తూ పేర్కొన్నాడు. శివానీకి ఏమీ దక్కకూడదని, వారి కుటుంబానికి శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.