శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 డిశెంబరు 2017 (10:08 IST)

వనిత కోసం పోలీసుల గాలింపులు: బిడ్డకోసమే పోరాడుతున్నానని సెల్ఫీ వీడియో

కమెడియన్ విజయ్ సాయి భార్య వనిత కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె నివాసంలో లేకపోవడంతో.. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘా వుంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో

కమెడియన్ విజయ్ సాయి భార్య వనిత కోసం జూబ్లీహిల్స్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె నివాసంలో లేకపోవడంతో.. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిఘా వుంచారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం ఆరోపణలపై నమోదైన కేసులో నిందితురాలిగా ఉన్న వనితకు నోటీసులు జారీ చేసేందుకు జూబ్లీహిల్స్‌ పోలీసులు యత్నిస్తున్నారు.

అయితే ఆమె అందుబాటులో లేకపోవడంతో కుటుంబీకులను ప్రశ్నించారు. వనిత ఫోన్‌ సిగ్నల్స్‌ పరిశీలించగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. రెండు బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు వనిత కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే వనిత ఓ సెల్ఫీ వీడియోలో తాను ఎక్కడికీ పారిపోలేదని చెప్పింది. తన బిడ్డ భవిష్యత్ తనకు ముఖ్యమని, అందుకే తన పోరాటమని స్పష్టం చేసింది. విజయ్ అక్రమ సంబంధాలు భరించలేకే తాను విజయ్‌కి నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నట్టు తెలిపింది. తనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తోంది. ఆధారాలన్నీ సేకరించుకుని పోలీసుల ముందు లొంగిపోతానని ఆ వీడియోలో వెల్లడించింది.