మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (16:54 IST)

ఇదీ నా భర్త నిజస్వరూపం... అమ్మాయిలతో విజయ్.. ఫోటోలు లీక్ చేసిన వనిత

తన భర్త నిజ స్వరూపాన్ని వనితా రెడ్డి బయటపెట్టింది. కమెడియన్ విజయ్ సాయి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో భార్య వనితా రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తన భర్త నిజ స్వరూపాన్ని వనితా రెడ్డి బయటపెట్టింది. కమెడియన్ విజయ్ సాయి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో భార్య వనితా రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త అమ్మాయిలతో ఉన్న ఫోటోలను మీడియాకు లీక్ చేసింది. విజయ్ అసలు రూపం అందరికీ తెలియాలనే తాను ఫొటోలను విడుదల చేస్తున్నట్లు అజ్ఞాతంలో ఉన్న వనితా రెడ్డి తెలిపారు. 
 
తన కూతురు భవిష్యత్ కోసమే విజయ్‌కు దూరంగా ఉన్నానని చెప్పారు. విజయ్ ఆత్మహత్యతో తనకు ఏమాత్రం సంబందం లేదని, ఇకనైనా పరిస్థితులను అర్థం చేసుకొని మీడియా తనపై అతస్య ప్రచారం చేయడం మానుకోవాలని కోరారు. తానెక్కడికీ పారిపోలేదని, త్వరలో పోలీసుల ఎదుట లొంగిపోతానని తెలిపింది. ఈ మేరకు మీడియాకు సందేశం పంపారు. 
 
విజ‌య్‌ త‌ల్లి, తండ్రి త‌న‌ను నేర‌స్తురాలిగా చూప‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారని తెలిపింది. విజ‌య్ ఆత్మ‌హ‌త్య గురించి త‌న అత్తామామ ఆలోచిస్తున్నార‌ని, త‌న కూతురి భ‌విష్య‌త్తు గురించి ఏ మాత్రం ఆలోచించ‌డం లేద‌ని వాపోయింది. కార్లు, బంగారం, ఆస్తి నేను తీసుకున్నాన‌ని వారు చెబుతున్నారని, నిజానికి త‌న‌ కార్లు, బంగార‌మే వారు తీసుకున్నారని పేర్కొంది. కావాలంటే ఇదివ‌ర‌కు తాను కోర్టులో చేసిన ఫిర్యాదు చూడ‌వ‌చ్చ‌ని తెలిపింది. అవే రివ‌ర్సులో త‌నపై వేస్తున్నారని చెప్పింది. 
 
తాను వారిపై ఎయే కేసులు వేశానో కోర్టులో తెలుసుకోవ‌చ్చని, మూడేళ్లుగా నాకు దూరంగా ఉన్న విజ‌య్ ఇప్పుడు నా వ‌ల్లే ఆత్మ‌హ‌త్య ఎలా చేసుకుంటాడు? అని ప్ర‌శ్నించింది. ఇది స‌రైంది కాదని, త‌న‌పై నింద‌లు మోప‌డానికి మాత్ర‌మే ఇలా చేస్తున్నార‌ని చెప్పింది. కాగా, వనితా రెడ్డి కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న విషయం తెల్సిందే. అయితే, ఆమె అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం.