శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2017 (08:54 IST)

మెంటల్ టెన్షన్‌తో విజయ్ సూసైడ్.. ముందస్తు బెయిల్‌ కోరిన భార్య వనిత

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి సూసైడ్ కేసులో ఒక్కోరోజు ఒక్కో నిజం వెలుగు చూస్తోంది.

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి సూసైడ్ కేసులో ఒక్కోరోజు ఒక్కో నిజం వెలుగు చూస్తోంది. తాజా ఆయన భార్య వినితా రెడ్డి, ఆమె అడ్వకేట్ శ్రీనివాస్ పెట్టిన మానసిక ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి మీడియాలో వైరల్ అయింది. దీన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆత్మహత్యకు ముందు భార్య వనితతో మాట్లాడిన కాల్‌ రికార్డును పోలీసులు పరిశీలిస్తున్నారు. "నా జీవితంతో ఆడుకున్న నిన్ను విడిచిపెట్ట"నని విజయ్‌తో భార్య వనిత సంభాషించిన ఓ ఆడియో క్లిప్‌ వైరల్‌గా మారింది. 
 
భార్య మాటలు, అడ్వకేట్‌ రూ.3 కోట్ల డిమాండ్‌తో తదితర అంశాలతోనే విజయ్‌ ఒత్తిడికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదేసమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు వచ్చిన తర్వాత వనిత, అడ్వొకేట్‌ శ్రీనివాస్‌ అరెస్టు ఖాయమని తెలుస్తోంది. దీంతో భార్య వనితా రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది.