సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2017 (16:58 IST)

వనితా.. 2 రోజులు హ్యాపీగా ఉండాలి.. అదే నా చివరి కోరిక: విజయ్ ఫోన్ కాల్

క‌మెడియ‌న్ విజ‌య్ సాయి ఆత్మహత్యకు ముందు తన భార్య వనితతో మాట్లాడాలనుకున్నాడు. భార్యకు రెండేళ్ల పాటు దూరంగా ఉన్నా.. వనితతో మాట్లాడేందుకు విజయ్ సాయి చాలాసార్లు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని వని

క‌మెడియ‌న్ విజ‌య్ సాయి ఆత్మహత్యకు ముందు తన భార్య వనితతో మాట్లాడాలనుకున్నాడు. భార్యకు రెండేళ్ల పాటు దూరంగా ఉన్నా.. వనితతో మాట్లాడేందుకు విజయ్ సాయి చాలాసార్లు ప్రయత్నించాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని వనిత విజయ్ తండ్రితో చెప్పింది. విజయ్ తనను కలవాల్సిందిగా కోరుతున్నాడని.. పాపను కూడా స్కూల్‌కెళ్లి చూస్తున్నాడని వనిత చెప్పుకొచ్చింది. 
 
పాపను స్కూలుకు వెళ్లి కలవడం చేయొద్దని విజయ్‌తో చెప్పాల్సిందిగా వనిత కోరింది. విజయ్ తండ్రి, వనితల ఫోన్ సంభాషణ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా విజయ్ ఆత్మహత్య చేసుకునేందుకు ముందు చివరిసారిగా భార్యతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో టేపు లీకైంది. అందులో తన చివ‌రి కోరికను విజ‌య్ తెలిపాడు. 
 
భార్య‌తో క‌లిసి రెండ్రోజులు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాడు. పదిహేను నిమిషాలు కలిసి మాట్లాడుకుందామని వనితా రెడ్డి కోరాడు. ఆ తర్వాత వనిత జీవితంలోకి అడ్డురానని విజయ్ తెలిపాడు. అలాగే వారి జీవితంలోకి మూడో వ్యక్తి రావడం వల్లే జీవితాలు చెల్లాచెదురయ్యాయని విజయ్ ఆ టేపులో చెప్పినట్లు సమాచారం. 
 
మరోవైపు తండ్రితో విజయ్‌కు ఆస్తి తగాదాలున్నాయని.. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వనిత చెప్పింది. విజయ్‌ను తాను బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. విజయ్‌ వేధింపులు తట్టుకోలేక తానే చనిపోవాలనుకున్నానని వెల్లడించింది.
 
అయితే ఇంట్లోని బంగారాన్ని వనిత దొంగతనం చేసిందని విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు.