మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (21:03 IST)

నా భర్తకు ఎయిడ్స్ తగులుకుంది... మరో బాంబు పేల్చిన విజయ్ భార్య...

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ ఆత్మహత్యపై ఆయన భార్య వనితారెడ్డి మరో బాంబు పేల్చారు. ఆయనకు ఎయిడ్స్ తగులుకుందని అన్నారు. సినిమాల్లో నటించగా వచ్చే డబ్బంతా అమ్మాయిల కోసమే తగలేసేవారని చెప్పుకొచ్చారు. తనతో ఆయన

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ ఆత్మహత్యపై ఆయన భార్య వనితారెడ్డి మరో బాంబు పేల్చారు. ఆయనకు ఎయిడ్స్ తగులుకుందని అన్నారు. ఈ విషయాన్ని ఆయనతో సన్నిహితంగా వుండే అమ్మాయే చెప్పిందని వెల్లడించారు. సినిమాల్లో నటించగా వచ్చే డబ్బంతా అమ్మాయిల కోసమే తగలేసేవారని చెప్పుకొచ్చారు. తనతో ఆయన అప్పట్లో ఇక ఎంతో కాలం బతకనని చెపుతుండేవారని చెప్పుకొచ్చారు. విజయ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్లు వున్నాయనీ, అందువల్లనే అతడితో కాపురం చేయలేక విడిగా వచ్చేసినట్లు తెలిపారు. మరోవైపు తన చావుకు తన భార్యతో సహా మరో ఇద్దరు వ్యక్తులంటూ విజయ్ తన సెల్ఫీ వీడియోలో చెప్పినట్లు తెలుస్తోంది.
 
ఆత్మహత్యకు ముందు విజయ్ సెల్ఫీ వీడియో తీశాడు. ఇందులో తన భార్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుంటున్నట్టు పేర్కొన్నాడు. పైగా, రూ.3 కోట్లు ఇవ్వాలని బెదిరించారనీ, తనవద్ద ఉన్న కారు, బంగారు వస్తువులను ఈ ముగ్గురు బెదిరించి తీసుకెళ్లారంటూ ఆ వీడియోలో వెల్లడించారు.
 
ఇంకా చెపుతూ... 'వాల్ పోస్టర్' సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయం అయిందని, పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం.. తన భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. చివరకు తన కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని పేర్కొన్నారు. 
 
వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లి అయిందన్నారు. తన భార్య, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని వారి సొంతూరుకు వెళ్తే తెలిసిందని విజయ్ వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. వనితలాంటి వారిని వదలొద్దు. డాడీ.. ఎవ్వరిని విడిచిపెట్టొద్దు.. నిద్ర పట్టడం లేదు. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్ యూ డాడీ.. కుందన అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకొని రండి డాడీ.. ప్లీజ్ డాడీ.. అంటూ విజయ్ సెల్ఫీ వీడియోలో స్పష్టంచేశారు. ఈ వీడియో ప్రస్తుతం పోలీసులు చేతికి చిక్కింది. దీంతో విజయ్ ఆత్మహత్యకు భార్యే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.