శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:12 IST)

ప్రియుడితో గొడవపడి 15 అంతస్తుల భవనం నుంచి దూకేసింది

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఏకంగా 15 అంతస్తుల భవనం నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ముంబై మహానగరంలో కలకలంరేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై నగరంలోని మలాద్ వెస్ట్ ప్రాంతానికి చెందిన అర్పిత తివారీ (25) యానిమేటరుగా పనిచేస్తున్న పంకజ్ జాదవ్‌ను ప్రేమించింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
దీంతో పెళ్లి విషయం మాట్లాడేనిమిత్తం అర్పిత ప్రియుడు ఉండే ఫ్లాట్‌కు వచ్చింది. అయితే, వారిద్దరి ఏం జరిగిందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ నివాసముంటున్న 15 అంతస్తు భవనం నుంచి కిందకు దూకేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. అర్పిత ఆత్మహత్య చేసుకుందా? లేదా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సాయంతో దర్యాప్తు చేస్తున్నారు.