సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (11:53 IST)

అమాయకుడా.. హఫీజ్‌ను అరెస్ట్ చేయండి..అమెరికా

ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలయ్యాడు. ముంబైలో దాడులకు పాల్పడి 166 మంది ప్రాణాలను బలిగొన్న హఫీజ్‌ను గృహనిర్భంధం నుంచి తప్పించాలని లాహోర్ హై

ముంబై పేలుళ్ల సూత్రధారి, నిషేధిత జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలయ్యాడు. ముంబైలో దాడులకు పాల్పడి 166 మంది ప్రాణాలను బలిగొన్న హఫీజ్‌ను గృహనిర్భంధం నుంచి తప్పించాలని లాహోర్ హైకోర్టులోని రివ్యూ బోర్డు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సర్కారు హఫీజ్ సయ్యిద్ దోషి అనేందుకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో హఫీజ్‌ను విడుదల చేయాలని రివ్యూ బోర్డు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో హఫీజ్ విడుదలపై పాకిస్థాన్ తీరును అమెరికా తప్పుబట్టింది. భారత్‌పై యుద్ధం ప్రకటించిన హఫీజ్‌ను తిరిగి అరెస్టు చేయాలని.. అతనిపై కేసు నమోదు చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా సూచించింది. కాగా హఫీజ్‌ సయీద్‌ గృహనిర్బంధం నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే భారత్‌పై యుద్ధానికి సై అన్నాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. 
 
అందులో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. కాశ్మీర్‌కు మద్దతిస్తున్నాననే పది నెలలపాటు తనను గృహ నిర్భంధం చేశారని.. ఇక ఆగేది లేదని కాశ్మీరీల కోసం పోరాటం కొనసాగిస్తానన్నాడు. ఇందుకోసం పాకిస్థాన్ ప్రజలను ఏకం చేసి కాశ్మీరీలు కోరుకునే స్వాతంత్ర్యాన్ని అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని హఫీజ్ సయీద్ తెలిపాడు. 
 
భారత్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోందని.. అయినా న్యాయస్థానం నమ్మలేదన్నాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని కోర్టు ధ్రువీకరించిందన్నాడు. ఈ నేపథ్యంలో హఫీజ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయని.. ఈ మేరకు హఫీజ్‌పై కేసు నమోదు చేసి.. అతనిని అరెస్ట్ చేయాలని అమెరికా పాకిస్థాన్‌కు సూచించింది.