సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (11:05 IST)

ఇవాంకా కోసం ఇండో - అమెరికా గాజులు

ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌ నగరానికి వచ్చే అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కోసం హైదరాబాద్ వ్యాపారులు స్పెషల్ గాజులను తయారుచేశారు.

ఈనెల 28వ తేదీన హైదరాబాద్‌ నగరానికి వచ్చే అమెరికా అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కోసం హైదరాబాద్ వ్యాపారులు స్పెషల్ గాజులను తయారుచేశారు. 
 
ఇదే అంశంపై పాతబస్తీ లాడ్‌ బజార్‌లోని ఖాజా బ్యాంగిల్‌ స్టోర్‌ యజమాని మహ్మద్‌ అన్వర్‌ భారత జాతీయ జెండా, అమెరికా దేశ పతాకం రంగులతో నెల రోజుల పాటు శ్రమించి అద్భుతమైన గాజుల పేరును తయారు చేశారు. వీటిని ఇవాంకాకు ఉచితంగా బహుకరించనున్నారు. 
 
హైదరాబాదీ లక్క బ్యాంగిల్స్‌ తరహాలో తయారు చేసిన ఈ గాజులలో కట్‌ గ్లాస్‌ స్టోన్‌ను సెట్‌లో అమర్చారు. ఇవాంక ట్రంప్‌ లాడ్‌ బజార్‌ సందర్శనకు  వస్తే భారత, అమెరికా దేశపతాకాలతో రూపొందించిన గాజుల సెట్‌ను బహూకరించనున్నట్లు అన్వర్‌ వెల్లడించారు.