సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 నవంబరు 2017 (20:23 IST)

ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ట్వీట్లు చేస్తుండగా గాయని సునీత ఓ సెటైర్ వేశారు. హైదరాబాద్ నగరంలో ఇవాంకా ట్రంప్ ప్రయాణించే రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయనీ, ఇవాంకా ట్ర

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ట్వీట్లు చేస్తుండగా గాయని సునీత ఓ సెటైర్ వేశారు. హైదరాబాద్ నగరంలో ఇవాంకా ట్రంప్ ప్రయాణించే రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయనీ, ఇవాంకా ట్రంప్ హైదరాబాదులోని రాయదుర్గం టు ఖాజాగూడ రోడ్డులో రావడంలేదేమో.... వస్తే బావుంటుందంటూ ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. 
 
దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్ చేస్తూ సునీతకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. కాగా ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆమె ప్రయాణించే రోడ్లను లక్షల రూపాయలతో ఆధునీకరించి మెరుపులు దిద్దారు అధికారులు. ఆ రోడ్లు మాత్రమే అలావుండి మిగిలిన రోడ్లు గతుకులమయంగా వుండటంపై ఇప్పటికే నగరవాసులు చిర్రుబుర్రులాడుతున్నారు. కొందరు ఇలా సెటైర్లతో చురకలు అంటిస్తున్నారు. మరి కేసీఆర్ నగరంలోని అన్ని రోడ్లను ఇవాంకా ప్రయాణించే రోడ్ల మాదిరిగా చేస్తారేమో చూడాలి.