శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2017 (17:06 IST)

కేసీఆర్ అందాన్ని చూసి ఇవాంకా ట్రంప్ షాక్ అవ్వడం ఖాయం

గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఇవాంకా షాక్‌ కావడం ఖాయమని వర్మ కామెంట్స్ చేశాడు. కేసీఆర్, ఇవాంకా పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని పందెం కాస్తాను. అలా

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తెపై పడ్డాడు. నవంబర్‌ 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్యూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఇవాంకా హైదరాబాద్‌లో రానున్న సంగతి తెలిసిందే. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఆమెను సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ కామెంట్లు గుప్పించాడు. అసలు ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించడానికి గల ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదంటూ పేర్కొన్నాడు. 
 
"కానీ, నేను మాత్రం ఇవాంకా రియల్ ఫిగర్‌ను చూడాలని ఎంతోగానూ ఎదురుచూస్తున్నాను..'' అంటూ ఇటీవల పోస్టులు చేశాడు. తాజాగా.. ఇవాంకాపై వరుసగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టాడు వర్మ. ఇవాంకాకు తాను అందంగా వుంటాననే అహంకారం ఎక్కువన్నాడు. అయితే సీఎం కేసీఆర్‌ అందాన్ని చూసి ఇవాంకా షాక్‌ కావడం ఖాయమని వర్మ కామెంట్స్ చేశాడు. 
 
కేసీఆర్, ఇవాంకా పక్కపక్కన కూర్చుంటారు కాబట్టి, అప్పుడు ఇవాంకాను ఎవరూ చూడరని పందెం కాస్తాను. అలాగే, ఇవాంకాకు అంతర్జాతీయ అందగత్తెగా, మొత్తం కుటుంబం చూడతగ్గ ఉత్తమ అందగత్తెగా, ఉత్తమ ప్రపంచ సుందరి నాయకురాలిగా.. మూడు స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు ఇవ్వాలి.. అంటూ వరుసగా పోస్టులు పెట్టాడు.