శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (14:44 IST)

హఫీజ్ సయీద్ అంటే నాకెంతో ప్రేమ: ముషారఫ్ సెన్సేషనల్ కామెంట్స్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది, జామాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరుడుగట్టిన ఉగ్రవాది, జామాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తాయిబా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన హఫీద్ సయీజ్ అంటే తనకు ఎంతో ప్రేమ, ఇష్టమని ముషారఫ్ అన్నారు. 
 
కాశ్మీర్ వేర్పాటువాదులకు సయీద్ ఎంతో సహకారం అందిస్తున్నాడని, జీహాద్‌కు ఊతమిచ్చే సయీద్ అంటే తనకెంతో మమకారమని చెప్పుకొచ్చారు. సయీద్‌తో ఎన్నోసార్లు భేటీ అయ్యానని వెల్లడించారు. 
 
జమ్మూ-కాశ్మీర్‌పై సైనిక చర్యకు తాను అనుకూలంగానే వుంటానని ముషారఫ్ తెలిపారు. కానీ భారత సైన్యం చాలా శక్తివంతమైందనే విషయాన్ని ముషారఫ్ ఒప్పుకున్నారు. అమెరికా సహకారంతో లష్కరే తాయిబాను ఉగ్ర సంస్థగా ప్రకటించడంలో భారత్ సఫలమైందని అన్నారు. అయినప్పటికీ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. లష్కరే తోయిబాకు మద్దతుదారుడినేనని సంచలన కామెంట్స్ చేశారు. హఫీజ్‌కు ముంబై పేలుళ్లకు ఎలాంటి సంబంధం లేదని ముషారఫ్ అన్నారు.