శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (13:09 IST)

దాయాది దేశం బుద్ధి ఏమిటో బయటపడింది.. ముంబై పేలుళ్ల సూత్రధారికి క్లీన్‌చిట్

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ముంబై దాడుల నిందితులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందన్న వాదనలకు ఊతమిస్తూ.. దాయాది దేశం తన బుద్ధెంటో నిరూపించుకుంది. ఇందులో

ముంబై పేలుళ్ల అనంతరం భారత్-పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ముంబై దాడుల నిందితులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇస్తోందన్న వాదనలకు ఊతమిస్తూ.. దాయాది దేశం తన బుద్ధెంటో నిరూపించుకుంది. ఇందులో భాగంగా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది.

అంతటితో ఆగకుండా సయీద్‌ నేతృత్వంలోని టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉద్-దవా (జేడీయూ)పై ఉన్న ఆరోపణలను ఉపసంహరించుకుంది. తద్వారా ముంబై దాడుల సూత్రధారిని పాకిస్థాన్ కాపాడినట్లైంది. కానీ హఫీజ్‌ను భారత్, అమెరికా, ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  
 
ఇకపోతే.. పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం సయీద్‌ను అరెస్ట్ చేసిన ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వ అధికారి సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో సయీద్ అతడి అనుచరుల విషయంలో జారీ చేసిన ఆదేశాల్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆరోపణలు లేవని.. అందుచేత సయీద్‌ను విడుదల చేయాలని ఆయన తరపు న్యాయవాది ఏకే డోగర్ లాహార్ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి హఫీజ్‌పై ఉన్న ఆరోపణలను తెలియజేయాల్సిందిగా కోరారు. కాగా, హఫీజ్ దరఖాస్తుపై వచ్చేవారం విచారణ జరిగే అవకాశం ఉంది.