శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (13:08 IST)

హఫీజ్‌ విడుదలపై అమెరికా ఆందోళన... పాక్‌కు వార్నింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షం

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ కల్పించింది. ఆయన్ను గృహనిర్బంధం నుంచి విడుదల చేసింది. దీనిపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ పాక్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. హఫీజ్ చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకొని మళ్లీ అరెస్టుచేయాలని కోరింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని యూఎస్‌ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
 
'లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అగ్రనేత పాకిస్థాన్‌లో గృహనిర్బంధం నుంచి విడుదల కావడంపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోంది. సయీద్‌ ఆధ్వర్యంలోని ఉగ్రవాద సంస్థలు ప్రపంచంలోనే అనేకచోట్ల మారణహోమం సృష్టించి అమెరికా సహా అనేకచోట్ల అమాయకుల్ని బలితీసుకున్నాయి. అందువల్ల పాకిస్థాన్ అతడిని మళ్లీ అరెస్టుచేయాలి' అని ఆ కార్యాలయ ప్రతినిధి హ్యాథర్‌ న్యూరెట్‌ డిమాండ్‌ చేశారు.
 
ముంబై దాడుల సూత్రధారి అయిన సయీద్‌ను జనవరి 31 నుంచి పాక్‌ నిర్బంధంలో ఉంచింది. నవంబర్‌ 23వ తేదీతో అతడి నిర్బంధ గడువు ముగియడంతో అతడిని శుక్రవారం అర్థరాత్రి విడుదలచేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది అయిన సయీద్‌ తలపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.