బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2017 (11:41 IST)

ఉగ్రవాది హఫీజ్ సయీద్ పార్టీని నిషేధించండి : ఈసీకి పాక్ సిఫారసు

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ

లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌‌కు పాకిస్థాన్ తేరుకోలేని షాకిచ్చింది. ఈయన ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేయడంలో భాగంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. దీన్ని లష్కరే తోయిబా ఆధ్వర్యంలో మిల్లీ ముస్లిం లీగ్స్ (ఎంఎంఎల్) అనే పేరును పెట్టాలని నిర్ణయించారు. 
 
ఈమేరకు ఆయన ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సయీద్ మద్దతిస్తున్న కొత్త పార్టీని నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదేశించింది. ఈ నిర్ణయంతో సయీద్ షాక్‌కు గురయ్యారు. 
 
ఈ నెల 22వ తేదీన పాక్ జాతీయ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో 2008 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌‌ను ఉగ్రవాదిగా భారత్, అమెరికాలు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. ఆ పార్టీ దరఖాస్తును తిరస్కరించాలని సూచించింది. కాగా, హఫీజ్ సయీద్ ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే.