సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By tj
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:27 IST)

కలలో పాము కాటేస్తే.. అదృష్టమే..ఎలా..?

స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు. మీ కలలో పాము కనిపి

స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో కనిపిస్తాయని సర్పశాస్త్రం చెబుతోంది. పాము కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో ఏమో అని అందరూ భయపడుతుంటారు. మీ కలలో పాము కనిపించి అది కాటు వేసి వెళ్ళిపోతే ఇక ఎలాంటి సమస్య ఉండదని శాస్త్రం చెబుతోంది. అలాగే పాము కనిపించి ఏమీ చేయకుండా మెల్లగా జారుకుంటే ఆ వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటారు.
 
అయితే పాము కలలో మీకు వెంటాడితే మాత్రం సమస్యలు, కష్టాలు తప్పవు. ఇలా పాము కలలో మిమ్మల్ని వెంటాడినట్లయితే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడానికి సిద్థంగా ఉండాలి. పాము వెంటాడినట్లు కనిపిస్తేను లేదా తరచూ సాములు స్వప్నంలో కనిపిస్తేనూ ప్రతి శుక్రవారం నాగదేవతకు పాలు పోసి పూజించాలి. పాము పుట్టకు పసుపు, కుంకుమ, నల్లగాజులు ఉంచి సుబ్రమణ్యస్వామికి అర్చనలు, అభిషేకాలు చేయాలి. భక్తితో స్వామిని ప్రార్థిస్తే సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.