బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (17:48 IST)

భార్యను కత్తితో పొడిచి కలలోనే చంపేశాడట.. కానీ రక్తపు మడుగులో?

అమెరికాలో ఓ వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుని ఆ మత్తులోనే భార్యను హతమార్చాడు. కలలో చంపేసినట్లు అనిపించిందని.. కానీ అదే విషయం కళ్లముందు జరిగిపోయిందని నానారకాలుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వ

అమెరికాలో ఓ వ్యక్తి ట్యాబ్లెట్ వేసుకుని ఆ మత్తులోనే భార్యను హతమార్చాడు. కలలో చంపేసినట్లు అనిపించిందని.. కానీ అదే విషయం కళ్లముందు జరిగిపోయిందని నానారకాలుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు తలపట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ ఉన్నట్టుండి అమెరికా ఎమెర్జీన్సీ నెంబర్ 911కి అర్థరాత్రి కాల్ చేశాడు. 
 
ఫోన్ చేసి అవతలి వారితో తన భార్యను తానే చంపేసినట్లు అనిపిస్తోందని.. వెంటనే ఇక్కడకు రాగలరా అని అడిగాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఫెల్ప్స్ భార్య లారెన్‌ రక్తపు మడుగులో వుండటాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేగాకుండా ఫెల్ప్స్ మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్నాడు. దీంతో అతనే భార్యను చంపేసి వుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో దగ్గుతో బాధపడుతున్న అతను ముందు రోజు రాత్రి కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత చూస్తే తన భార్య మరణించిందని.. పక్కనే కత్తికూడా వుందని చెప్పాడు. నిద్రలో వుండగా తన భార్యను తానే చంపినట్లు అనిపించిందని.. లేచి చూసేసరికి అది నిజమైందని తెలిపాడు. ఇలా నోటికొచ్చినట్లు వాగాడు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది.