సంబంధిత వార్తలు
- అమరావతిలో అకృత్యాలు: డ్రగ్స్, మందు, పబ్లిక్ రొమాన్స్, పార్టీలు...?
- భర్తతో రొమాన్స్ వద్దేవద్దు.. బొమ్మల రతికి ఓకే: భారతీయ మహిళల ఆసక్తి- ఆ రాష్ట్రమే టాప్
- అతడు నా చెల్లికి అన్నయ్య, నా పేరెంట్స్‌కి కొడుకు... నాకు మాజీ మొగుడు: హీరోయిన్ మాట
- దానిమ్మకు అంతటి శక్తి వుందా...? శృంగార సామర్థ్యం పెంచుతుందట...
- ఇంగ్లండ్ మోడల్ కిడ్నాప్ : రూ.1.9 కోట్లకు శృంగార బొమ్మగా విక్రయం
రొమాన్స్ కలలొస్తే అర్థం ఏమిటి? లిప్ కిస్ ఇచ్చేటట్లు కలవస్తే..?
మానవులందరికీ స్వప్నాలు రావడం మామూలే. అందులో చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా
మానవులందరికీ స్వప్నాలు రావడం మామూలే. అందులో చాలామందికి రొమాన్స్ చేసేట్లు కలలు వస్తుంటాయి. వాటిని ఎలా బయటికి చెప్పడం సిగ్గుగా వుండదూ.. అంటూ చాలామంది తమకొచ్చిన డ్రీమ్స్‌ను ఇతరులతో పంచుకోకుండా సైలెంట్‌గా వుండిపోతారు. అలాంటి కలలు మీకూ వచ్చాయా? అయితే ఆ కలల అర్థమేమిటో తెలుసుకోండి.
ప్రేమను వ్యక్తపరిచే.. ప్రపోజల్ చేస్తున్నట్లు కల వస్తే.. మీరు చేస్తున్న పని లేదా మీరు చేయబోతున్న పని సక్సెస్ అవుతుందని గ్రహించాలి. మాజీ ప్రేయసి లేదా మాజీ సతీమణితో శృంగారంలో పాల్గొన్నట్లు కలవస్తే.. వారితో సంబంధాలు కటీఫ్ కానున్నాయని అర్థం చేసుకోవాలి.
ఒక వేళ పెళ్ళైన వారికి మాజీ ప్రేయసిని తలచుకుంటూ వుండేవారికి.. అలాగే విడాకుల కోరి మాజీ సతీమణిని దూరం చేసుకోవాలనుకునేవారికి ఇలాంటి కల వస్తే తప్పకుండా వారి నుంచి దూరం కానున్నారని గ్రహించాలి. గర్భం దాల్చిన మహిళ కలలో కనిపిస్తే.. లేదా కలగనే వారే గర్భమవుతున్నట్లు కలవస్తే.. జీవితంలో అభివృద్ధికి సంబంధించిన శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ముందు వెనకా పరిచయం లేని వ్యక్తులతో రొమాన్స్ చేసినట్లు కల వస్తే... జీవితంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. అభివృద్ధి సాధ్యమవుతుందని అర్థం చేసుకోవాలి.
ఒకే లింగబేధం వున్న వారు రొమాన్స్ చేసుకుంటున్నట్లు కలగంటే.. స్నేహానికి ఆపద తప్పదని గ్రహించాలి. లిప్ కిస్ ఇచ్చేటట్లు కలవస్తే.. జాగ్రత్తగా వుండాలని.. మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ సమస్య వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎప్పుడో ఓసారి ఇలా రొమాన్స్ కలలు వస్తే ఓకే కానీ.. అలాంటి కలలు తరచూ వస్తుంటే మాత్రం.. జీవితంలో అభివృద్ధి సాధించలేరని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు.
తర్వాతి కథనం
