మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (12:48 IST)

కమెడియన్ విజయ్ భార్య వనితారెడ్డి ఓ మోసగత్తెనా?

హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఓ మోసగత్తె అని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె అసలు పేరు వరలక్ష్మి అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న కమెడియన్ విజయ్ సాయి భార్య వనితా రెడ్డి ఓ మోసగత్తె అని తెలుస్తోంది. దీనికి కారణం ఆమె అసలు పేరు వరలక్ష్మి అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆమె స్కూల్ సర్టిఫికేట్‌లో ఒక పేరు, పాస్‌పోర్టులో మరో పేరు ఉంది. 
 
దీంతో ఆమె పేరు వనితా రెడ్డి కాదనీ, వరలక్ష్మీ అని పోలీసులు గుర్తించారు. అంతేగాక వనిత స్కూల్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టులో వేరువేరుగా తండ్రి పేర్లు ఉండటం గమనార్హం. ఈ కేసులో పలు కోణాల్లో జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ జరపగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
 
సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ సాయి భార్య పేరు వనిత కాదని, ఆమె అసలు పేరు వరలక్ష్మీ అని పోలీసులు గుర్తించారు. అలాగే వనిత పాస్‌పోర్ట్‌లో ఒక పేరు.. స్కూల్ సర్టిఫికెట్‌లో మరో పేరు ఉందని గుర్తించారు. 
 
ఇకపోతే.. వనిత తల్లి రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేసిందని, దీంతో రఫీకి విజయ్‌ సాయి ఆత్మహత్యతో ఏమైనా సంబంధముందా... అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ అనే న్యాయవాదికి, వనితకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. 
 
అయితే, ఈ వార్తలను వనితా రెడ్డి తోసిపుచ్చుతూ తన మామ సుబ్బారావుపై ఆరోపణలు చేస్తోంది. తన భర్త విజయ్‌కు, మామకు మధ్య ఉన్న విభేదాల వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఆమె ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. 
 
ఆదివారం మధ్యాహ్నం వరకు సంతోషంగా ఉన్న విజయ్ రాత్రి ఎందుకు ఉరేసుకున్నాడని అందులే వనితా ప్రశ్నిస్తోంది. ఒక ల్యాండ్ ఇష్యూలో విజయ్‌కి, ఆయన తండ్రికి మధ్య విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ కారణంతోనే విజయ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వనిత అనుమానం వ్యక్తం చేశారు. 
 
వారంతా పక్కా ప్లాన్‌తో తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కుమారుడి తప్పులను కప్పిపుచ్చేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎప్పటికైనా నిజానిజాలు బయటకు వస్తాయన్న వనిత... విజయ్ ఆత్మహత్యకు కారణం తాను కాదని స్పష్టంచేశారు.