శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 11 డిశెంబరు 2017 (16:32 IST)

నటుడు విజయ్‌కు వేరే అమ్మాయితో ఎఫైర్... అందుకే విడాకులు కోరా: భార్య వనిత

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ ఆత్మహత్య వెనుక అసలు విషయాలు ఏమిటో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తన ఆత్మహత్యకు కారణం తన భార్య వేధింపులు, శశిధర్ అనే వ్యక్తేనంటూ నటుడు విజయ్ ఓ సెల్ఫీ వీడియో తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ భార్య స్పందించారు. తను

టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ ఆత్మహత్య వెనుక అసలు విషయాలు ఏమిటో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తన ఆత్మహత్యకు కారణం తన భార్య వేధింపులు, శశిధర్ అనే వ్యక్తేనంటూ నటుడు విజయ్ ఓ సెల్ఫీ వీడియో తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై విజయ్ భార్య స్పందించారు. తను తన భర్తను విడిచిపెట్టి వేరేగా వుంటున్నాననీ, ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తనకు తెలియదన్నారు. 
 
ఇకపోతే... తన భర్త వేరే అమ్మాయితో సంబంధం వున్నదనీ, దాన్ని తన కళ్లారా చూశాననీ, దాన్ని తట్టుకోలేక అతడి నుంచి విడిపోయినట్లు తెలిపారు. విడాకుల కోసం కోర్టులో పిటీషన్ కూడా వేసినట్లు తెలిపారు. ఈ కేసు రెండేళ్లుగా కోర్టులో వున్నదని వెల్లడించారు. 
 
విజయ్ ప్రవర్తన గురించి ఆయన తండ్రికి చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. ఇకపోతే శశిధర్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదన్నారు. అతడితో తనకు లింకు పెట్టి జరుగుతున్న ప్రచారంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు విజయ్ తో తను తెగతెంపులు చేసుకుంటే ఇంకా అతడి గురించి తనకు ఎందుకని ప్రశ్నించారు. విజయ్ తనను గతంలో ఎన్నో చిత్ర హింసలు పెట్టినా భరించాననీ, వాటిని ఎన్నడూ బహిరంగ పరచలేదంటూ వెల్లడించారు.