మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 11 డిశెంబరు 2017 (14:52 IST)

యాంకర్ ఝాన్సీ ఇకఇకలు పకపకలు... అది చూసి ఆ హీరో ఆ పని చేశాడట...

యాంకర్ ఝాన్సీ అంటే సామాజిక సమస్యలపై మాట్లాడటం ఇప్పుడు చూస్తుంటాం కానీ ఇదివరకు చాలా సినీ ఫంక్షన్లకు ఆమె యాంకర్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు కొత్తవారు రావడంతో కాస్త వెనక్కి తగ్గినా సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో నటిగా మారిపోయింది. అక్క, వొదిన పాత్రల్లో

యాంకర్ ఝాన్సీ అంటే సామాజిక సమస్యలపై మాట్లాడటం ఇప్పుడు చూస్తుంటాం కానీ ఇదివరకు చాలా సినీ ఫంక్షన్లకు ఆమె యాంకర్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు కొత్తవారు రావడంతో కాస్త వెనక్కి తగ్గినా సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో నటిగా మారిపోయింది. అక్క, వొదిన పాత్రల్లో చేస్తూ అప్పుడప్పుడు తళుక్కుమంటోంది. ఇదిలావుంటే ఆర్. నారాయణమూర్తి చిత్రంలో ఆమెకు మంచి ప్రాధాన్యత వున్న పాత్ర లభించిందట.
 
ఈ చిత్రంలో షూటింగ్ చేస్తున్న సమయంలో యాంకర్ ఝాన్సీ, తన తోటి నటీనటులతో సరదాగా నవ్వుతూ వుండేదట. ఐతే షూటింగ్ స్పాట్లో ఎంతో సీరియస్‌గా వుండే నారాయణమూర్తికి యాంకర్ ఝాన్సీ తననే చూసి ఎగతాళిగా నవ్వుతోందని భావించాడట. దాంతో ఆమె పాత్రకున్న ఇంపార్టెన్స్ తగ్గించేసి క్యారెక్టర్ నిడివిని కట్ చేసేసారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఝాన్సీ ఆ చిత్రంలో నటించనని చెప్పేసి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా గుర్తుచేసుకుని చెప్పింది మరి.