మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (11:55 IST)

నాగ్ మావయ్యతో విభేదాలా? సుమత్ ఏమన్నాడు?

అక్కినేని వంశ హీరోల్లో సుమంత్ ఒకరు. రెండు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. కెరీర్‌పరంగా స్థిరపడలేక పోయాడు. అడపాదడపా మాత్రమే చిత్రాలు చేస్తున్నారు.

అక్కినేని వంశ హీరోల్లో సుమంత్ ఒకరు. రెండు దశాబ్దాలకుపైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. కెరీర్‌పరంగా స్థిరపడలేక పోయాడు. అడపాదడపా మాత్రమే చిత్రాలు చేస్తున్నారు. పైగా, ఆయన కేరీర్‌లో నటించిన చిత్రాలన్నీ చాలా మేరకు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో తన మావయ్య అక్కినేని నాగార్జునతో సుమత్‌కు విభేదాలు తలెత్తాయన్న వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేసింది. 
 
నిజానికి సుమంత్‌ను వెండితెరకు పరిచయం చేసింది నాగార్జునే. 'ప్రేమ‌క‌థ' సినిమాతో సుమంత్ హీరోగా కనిపించాడు. ఆ త‌ర్వాత మరోసారి సుమంత్ హీరోగా 'స‌త్యం' అనే సినిమాను నిర్మించి భారీ హిట్ అందించాడు. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య ఇటీవ‌లికాలంలో విభేదాలు వ‌చ్చాయ‌ని, వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం మాట్లాడుకోవ‌డం లేద‌ని ఇటీవ‌ల కొన్ని వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. 
 
వీటిపై సుమంత్ స్పందిస్తూ, 'గ‌తంలో మావ‌య్య‌ని రోజూ క‌లిసి మాట్లాడేవాడిని. గ‌తంతో పోలిస్తే ఇప్పుడు ఆయ‌ణ్ని క‌ల‌వ‌డం త‌గ్గింది. అంతేకానీ, మామ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవు. అస‌లు బ‌య‌ట ఇలాంటి ప్ర‌చార‌మొకటి జ‌రుగుతోంద‌ని కూడా నాకు తెలియ‌దు. ఆయ‌న‌తో రోజూ ఫోన్‌లో మాట్లాడుతుంటా. అఖిల్‌, చైతూ, రానా.. ఇలా మా కుటుంబ హీరోలంద‌రితో నాకు మంచి అనుబంధ‌ముంది. వారితో క‌లిసి న‌టించ‌డానికి నేను సిద్ధ‌మని' సుమంత్ వెల్లడించాడు.