బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (17:01 IST)

అనసూయకు కోపమొచ్చింది.. ఆ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టింది.. ఎందుకు?

'జబర్దస్త్' యాంకర్ అనసూయ ఓ చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది. సెల్ఫీ కోసం తనవద్దకు వచ్చిన ఓ బాలుడి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టడంతో ఆమెపై కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రమఖ యాంకర్ అనసూయ తన వ్యక్తిగత పనిమీద తార్నాకకు కారులో వెళ్లి తిరిగి ఇంటికెళ్త

'జబర్దస్త్' యాంకర్ అనసూయ ఓ చిన్నపాటి వివాదంలో చిక్కుకుంది. సెల్ఫీ కోసం తనవద్దకు వచ్చిన ఓ బాలుడి ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టడంతో ఆమెపై కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రమఖ యాంకర్ అనసూయ తన వ్యక్తిగత పనిమీద తార్నాకకు కారులో వెళ్లి తిరిగి ఇంటికెళ్తూ మార్గమధ్యంలో కారు ఆపింది. ఇంతలో ఫోను రావడంతో ఆమె కారు దిగి మాట్లాడుతూ రోడ్డుపక్కన నిలబడింది. ఆ సమయంలో అటుగా తన తల్లితో వెళుతున్న ఓ బాలుడు... అనసూయను చూసి ఉప్పొంగిపోయి ఆమెతో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఆ బాలుడు సెల్ఫీ కోసం తన వద్దకురాగా, ఆగ్రహం చెందిన అనసూయ... బాలుడి చేతిలోని ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టింది. దీంతో ఆ ఫోన్ ముక్కలు కావడంతో ఆగ్రహించిన ఆ బాలుడి తల్లి నేరుగా పోలీసులకెళ్లి ఫిర్యాదు చేసింది. ఇంతలో ఈ విషయం సోషల్ మీడియాకు తెలియడంతో యాంకర్ అనసూయపై విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ వ్యవహారం మరింత పెద్దదికాకుండా ఉండేందుకు అనసూయ జరిగినదానిపై తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చింది. సెల్ఫీ దిగడానికి వచ్చిన పిల్లాడి ఫోన్ పగుల కొట్టినందుకు క్షమించాలి. అయితే, ఇది నిందించదగిన ఘటన కాదు. తనకు స్వేచ్ఛ వుందని పేర్కొంటూ... ఇలాంటి వార్తలన్నీ దేశానికి ఏమాత్రం అవసరం లేనివంటూ అనసూయ వ్యాఖ్యానించింది.