సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:29 IST)

రాజ్‌నాథ్‌కు షాకిచ్చిన చంద్రబాబు.. మోడీతో తాడోపేడో తేల్చుకుంటాం...

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేరుకోలేని షాకిచ్చారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో కఠిన నిర్ణయం తీసుకోనున్నారనే వార

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేరుకోలేని షాకిచ్చారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో కఠిన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో రాజ్‌నాథ్ రంగంలోకిదిగి చంద్రబాబుకు మూడుసార్లు ఫోన్లు చేశారు. చివరగా ఫోన్ లిఫ్ట్ చేసి సుమారు 15 నిమిషాల పాటు చంద్రబాబుతో రాజ్‌నాథ్ మాట్లాడారని, బాబుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. 
 
'ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దనే మాటను ప్రధాని నరేంద్ర మోడీ మాటగా పరిగణించాలని, అన్ని హామీలు నెరవేర్చుతామని' బాబుతో రాజ్‌నాథ్ అన్నట్టు సమాచారం. ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, ఇంకెంత కాలం ఎదురుచూడాలని, కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై ఇక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, వారి అభిప్రాయం మేరకు తాము నడచుకోవాల్సి ఉందని రాజ్‌నాథ్‌కు స్పష్టం చేశారు. 
 
ముఖ్యంగా, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్, రైల్వేజోన్ అంశాలపై ఓ ప్రకటన వెలువడే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేపడతామని చంద్రబాబు తెగేసి చెప్పారట. పునర్విభజన చట్టాన్ని మాత్రమే అమలు చేయమని కోరుతున్నామని, కొత్తగా మాకేం వద్దని రాజ్‌నాథ్‌కు బాబు తేల్చి చెప్పారు.