శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (15:02 IST)

బడ్జెట్ 2018 : మొబైల్ ఫోన్లు - టీవీ ధరలకు రెక్కలు

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని వచ్చే ఏప్రిల్ నెల నుంచి మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు పెరగనున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీ, వీడియో గేమ్ పరికరాలల దిగుమతులపై

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని వచ్చే ఏప్రిల్ నెల నుంచి మొబైల్ ఫోన్లు, టీవీల ధరలు పెరగనున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీ, వీడియో గేమ్ పరికరాలల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 20 శాతానికి పెంచారు. ఫలితంగా వీటి ధరలకు రెక్కలు రానున్నాయి.  
 
మరోవైపు, మేకిన్ ఇండియాను ప్రమోట్ చేసేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలపై భారం పడనుంది. విదేశాల్లో తయారు చేస్తున్న సెల్‌ఫోన్స్, టీవీలను ఇక్కడే తయారు చేయడం వల్ల.. ఇక్కడి యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉందనే కోణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
టీవీల విడిభాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ 15 శాతం పెరగనుంది. మొత్తానికి సెల్‌ఫోన్స్, టీవీల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో.. ధరలు అధికంగా పెరగనున్నాయి. మొత్తాని విత్తమంత్రి అరుణ్ జైట్లీ మొబైల్ ఫోన్లు తరుచూ మార్చేవారికి, టీవీలను కొనేవారికి తేరుకోలేని షాకిచ్చారు.