శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By pnr
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:16 IST)

#Budget2018 : నవ భారత్‌ను ఆవిష్కరిస్తున్నాం... జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్ట

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగ పాఠంలో అవినీతి రహిత పాలన అందిస్తామన్న గత ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
తమ ప్రభుత్వ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగినట్టు చెప్పారు. అలాగే, ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయని తెలిపారు. ఎగుమతుల్లో 15 శాతం వృద్ధి సాధ్యమని చెప్పారు. 
 
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించనుందని తెలిపారు. నవ భారత్‌ను ఆవిష్కరించేందుకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే యేడాది దేశ వృద్ధిరేటు 7.5 శాతంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.