గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:13 IST)

#Budget2018 సార్వత్రిక బడ్జెట్.. హిందీలో జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం

కేంద్ర బడ్జెట్ కొన్ని నిమిషాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే 2018-19 సార్వత్రిక బడ్జెట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమ

కేంద్ర బడ్జెట్ కొన్ని నిమిషాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే 2018-19 సార్వత్రిక బడ్జెట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ కావడంతో పాటు ప్రధాన మంత్రి మోదీ సర్కార్‌ ప్రవేశపెట్టనున్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఐదోసారి ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి హిందీలో బడ్జెట్ ప్రసంగాన్ని జైట్లీ ప్రవేశపెట్టారు. 
 
అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం గురువారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్‌లో సంస్కరణలకు ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు వినిపిస్తున్నాయి.