గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (14:51 IST)

అరుణ్ జైట్లీ బడ్జెట్ భేష్: సామాన్యులకు, వ్యాపారులకు అనుకూలం: మోదీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒరిగిందేమీలేదని తేలిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల మెగా ప్రాజెక్టులపై అరుణ్ జైట్లీ నోరుమెదపలేదు. అలాగే మధ్య

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఒరిగిందేమీలేదని తేలిపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల మెగా ప్రాజెక్టులపై అరుణ్ జైట్లీ నోరుమెదపలేదు. అలాగే మధ్యతరగతిపై కూడా నోరెత్తకుండా జైట్లీ బాదేశారని విమర్శలొస్తున్న వేళ.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ వుందని కొనియాడారు. 
 
ఈ బడ్జెట్ దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసేలా వుందని చెప్పుకొచ్చారు. సామాన్యులకు, వ్యాపారులకు ఈ బడ్జెట్ ఎంతో అనుకూలమని, రైతులు, దళితులు, గిరిజనులకు ఈ బడ్జెట్ ద్వా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పండ్లు, కూరగాయల రైతుల ప్రయోజనాల కోసం రూ.500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్స్ పథకం ప్రారంభించామని.. కిసాన్ క్రిడిట్ కార్డుల ద్వారా మత్స్య, పాడిపరిశ్రమ రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. 
 
అన్ని రకాలుగా వెనుకబడి వున్న వర్గాల అభ్యున్నతికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించామని.. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామీణ రహదారులను అనుసంధానం చేస్తామని మోదీ పేర్కొన్నారు. రైతులు రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల ఉత్పత్పి సాధిస్తున్నారని.. దేశంలో వ్యవసాయ ఉత్పాదక సంఘాల సేవలు విస్తృతమవుతున్నట్లు మోదీ ప్రకటించారు.