అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా : వేతన జీవుల చెవిలో పూలు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2018-19 సంవత్సర వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులపై ఆయన ఏమాత్రం కనికరించలేదు. ఈసారైనా వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని పెంచుతారని ఎంతో ఆశగా ఎదురుచూసిన కోట్ల మంది వేతన జీవులకు నిరాశే ఎదురైంది. ఆదాయ పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదని ఆయన తన బడ్జెట్ ప్రసంగలో ప్రకటించారు. దీంతో కోటానుకోట్ల మంది వేతన జీవుల చెవిలో పూలు పెట్టినట్టయింది.
గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో ఎన్నో సానుకూల మార్పులు చేశామని, ఈసారి మాత్రం స్లాబులలో ఎలాంటి మార్పు ఉండబోదని జైట్లీ కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. ఇకపోతే, 2017-18 యేడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.6 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇక పరోక్ష పన్ను వసూళ్లు 18.7 శాతం పెరిగాయని తెలిపారు. పన్ను పరిధిలోకి కొత్తగా చాలామంది వచ్చి చేరుతున్నా.. టర్నోవర్ మాత్రం ఆశించినంతగా లేదని అన్నారు.