మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (11:26 IST)

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి, వ్యవసాయానికి పెద్దపీట: అరుణ్ జైట్లీ

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పెరిగాయన్నారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత

అవినీతి రహిత సర్కారు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పెరిగాయన్నారు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నట్లు జైట్లు తెలిపారు. కొత్త ఇండియాను ఆవిష్కరించే క్రమంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటామని వాగ్ధానాలు చేశామని గుర్తు చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగాయన్నారు. అలాగే విదేశీ మారక నిల్వలు కూడా పెరిగాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక లావాదేవీలు పెరిగాయని వెల్లడించారు. 
 
జాతిపిత మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ గృహనిర్మాణం, పంటల బీమా పథకం వంటి ప్రస్తుత పథకాలకు నిధుల కేటాయింపు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కొత్త పథకాలను కూడా ఈ బడ్జెట్‌లో చోటు కల్పించవచ్చని భావిస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. ఆర్థిక వృద్ధిరేటు పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించామని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని జైట్లీ ప్రకటన చేశారు.