మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2018-19
Written By selvi
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2018 (13:54 IST)

మధ్యతరగతి మీద కనబడకుండా బాదుడు..

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యతరగతి మీద కనబడకుండా బాదారు. ఉద్యోగుల పన్నుల్లో ఎలాంటి మార్పులు ఇవ్వకుండా మధ్యతరగతి ప్రజలను దెబ్బతీశారు. మధ్య తరగతి ప్రజలు ఉద్యోగాలను నమ్ముకునేవారు కావడంతో వ్యక్తి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మధ్యతరగతి మీద కనబడకుండా బాదారు. ఉద్యోగుల పన్నుల్లో ఎలాంటి మార్పులు ఇవ్వకుండా మధ్యతరగతి ప్రజలను దెబ్బతీశారు. మధ్య తరగతి ప్రజలు ఉద్యోగాలను నమ్ముకునేవారు కావడంతో వ్యక్తిగత ఆదాయ పన్నులో ఎలాంటి స్లాబ్‌లు ఇవ్వకుండా జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిపై మధ్యతరగతి వారు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే వేతన ఉద్యోగులకు రూ.40వేల వరకు ప్రయాణ వైద్య ఖర్చులకు స్టాండర్డ్ డిటక్షన్‌ను అరుణ్ జైట్లీ వర్తింపజేసారు. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేకపోవడం మధ్యతరగతి వారిని దెబ్బతీసినట్లే అవుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 85.51కోట్లని.. పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 40శాతానికి పెరిగిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల కింద అదనంగా రూ.90వేల కోట్ల సేకరిస్తున్నామని వెల్లడించారు. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకొకసారి ఎంపీ వేతనాల్లో మార్పు అవసరమని.. తప్పకుండా ఐదేళ్లకోసారి వేతనాలు పెంచాల్సిందేనని అరుణ్ జైట్లీ తెలిపారు.