గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:56 IST)

అది జరగకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ర

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేటీఆర్ సవాలును స్వీకరిస్తున్నామన్నారు. 
 
అంతకుముందు తెరాస పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాటకు తాను కట్టుబడి వున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సవాల్‌కు సిద్ధంగా వుండాలని.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు.
 
అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే పెద్ద పప్పు ఎవ్వరూ లేరని కేటీఆర్ తెలిపారు. 2019  తెరాస అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పకుంటానన్న వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని చెప్పారు. సొంత నియోజకవర్గంలో మున్సిపాలిటీని గెలిపించుకోలేని అసమర్థుడు రాహుల్ అని.. గూగుల్‌లో వెతికినా అదే వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.