మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:07 IST)

భార్యను చంపి పాకిస్థాన్ మంత్రి ఆత్మహత్య

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఆ మంత్రిపేరు మీర్‌ హజార్‌

పాకిస్థాన్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. సింధ్ రాష్ట్రంలో సీనియర్ మంత్రి ఒకరు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆ దేశంలో కలకలం రేపుతోంది. ఆ మంత్రిపేరు మీర్‌ హజార్‌ఖాన్‌ బిజ్రానీ. వయసు 71 యేళ్లు. ఇద్దరి మృతదేహాలను వారి బెడ్‌రూమ్‌లోనే రక్తపుమడుగులో పోలీసులు గుర్తించారు. 
 
మీర్‌ భార్య ఫరీహ రజాక్‌ కూడా గతంలో పాక్‌ చట్టసభకు ప్రాతినిథ్యం వహించారు. ఓ జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆయన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీలో ఉన్న సీనియర్ నేతల్లో ఒకరు. సింధ్ రాష్ట్రంలో ప్లానింగ్ అండ్ డెవలెప్మెంట్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. వారిద్దరి మధ్య నెలకొన్న కలహాల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది.