బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (08:48 IST)

నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే రేప్ చేశాడు : జర్నలిజం విద్యార్థిని ఫిర్యాదు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమంత్ కటారే అనే ఎమ్మెల్యే తనపై అత్యాచార

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై జర్నలిజం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమంత్ కటారే అనే ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశారంటూ ప్రటించింది. ఈ మేరకు బాధిత యువతి జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టరు జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొంది. ఈ ఫిర్యాదు సంచలనమైంది. 
 
ఈ ఫిర్యాదుపై స్పందించిన భోపాల్ మహిళా పోలీసులు నిందితుడైన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కటారే అదృశ్యమయ్యారు. గతంలో జర్నలిజం విద్యార్థిని అయిన యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తుందని ఎమ్మెల్యే కటారే భోపాల్ క్రైంబ్రాంచ్ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట ఎమ్మెల్యే ఫిర్యాదు అనంతరం యువతిపై ఆయనపై కేసు పెట్టింది. ఈ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపింది.