గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 26 మే 2017 (09:48 IST)

'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తార'న్న చలపాయ్ వ్యాఖ్యలకు వత్తాసు.. యాంకర్ రవిపై కేసు

బుల్లితెర నటుడు, యాంకర్ రవిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయిలు హానికరమా? అంటూ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు చలపతిరావు సమాధానమిస్తూ అమ్మాయిలు హానికరం కాదుకానీ అమ్మాయిలు

బుల్లితెర నటుడు, యాంకర్ రవిపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మాయిలు హానికరమా? అంటూ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు చలపతిరావు సమాధానమిస్తూ అమ్మాయిలు హానికరం కాదుకానీ అమ్మాయిలు పక్కలోకి పనికివస్తారంటూ సమాధానమిచ్చారు. ఆ వెంటనే స్టేజ్‌పై ఉన్న యాంకర్ రవి సూపర్ సార్.. చాలా కూల్‌గా సమాధానమిచ్చారంటూ చలపాయ్ వ్యాఖ్యలను సమర్థించేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన యాంకర్‌ రవిపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. చలపతిరావుతో పాటు యాంకర్‌ రవిపై కేసు నమోదు చేయాలని ఈ నెల 23న మహిళా, ప్రజాసంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చలపతిరావుపై అదేరోజు కేసు నమోదు చేయగా, న్యాయ సలహా అనంతరం యాంకర్‌ రవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
 
కాగా, చలపతిరావు, రవిపై ఇప్పటికే సరూర్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైంది. బండ్లగూడకి చెందిన మహిళా సంఘం నేత దెయ్యాల కల్పనా కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 354 ఏ (IV), 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.