తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత '0' శాతం : 8 కాలేజీల్లోనే 90 శాతం ఉత్తీర్ణత
తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న అన్నా వర్శిటీ అనుబంధం కాలేజీలుగా ఉన్నాయి. ఈ వర్శిటీ అనుబంధంగా ఉన్న కాలేజీల సంఖ
తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ దేశంలో అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉన్న అన్నా వర్శిటీ అనుబంధం కాలేజీలుగా ఉన్నాయి. ఈ వర్శిటీ అనుబంధంగా ఉన్న కాలేజీల సంఖ్య 506. గతేడాది డిసెంబరులో నిర్వహించిన సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్‌ను అన్నా యూనివర్సిటీ విడుదల చేసింది.
ఇందులో తిరునల్వేలి, కాంచీపురం, కోయంబత్తూరులోని మూడు కాలేజీలకు చెందిన మొత్తం 83 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 506 కాలేజీల్లో కేవలం 8 కళాశాలలు మాత్రమే 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 253 కాలేజీలు 50 శాతం ఉత్తీర్ణ సాధించాయి. 12 కాలేజీలు ఉత్తీర్ణత శాతం పదిశాతం కంటే తక్కువే ఉండటం గమనార్హం.