శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (11:52 IST)

కన్నతండ్రి కాదు.. రాక్షసుడు... పిల్లలు బట్టలు మురికి చేస్తున్నారనీ... (వీడియో)

అన్నెం పున్నెం ఎరుగని అమాయక చిన్నారులు వారు.. లాలించి.. ఆడించి.. పెంచాల్సిన వయసు వారిది. భయపెట్టకుండా.. బెదిరించకుండా.. అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు పిల్లలపై రాక్షసత్వం ప్రదర్శించాడ

అన్నెం పున్నెం ఎరుగని అమాయక చిన్నారులు వారు.. లాలించి.. ఆడించి.. పెంచాల్సిన వయసు వారిది. భయపెట్టకుండా.. బెదిరించకుండా.. అల్లారుముద్దుగా పెంచాల్సిన కన్నతండ్రే తన ఇద్దరు పిల్లలపై రాక్షసత్వం ప్రదర్శించాడు. బట్టలు మురికి చేస్తున్నారని అభం శుభం తెలియని చిన్నారులను విచక్షణారహితంగా తండ్రి చితకబాదాడు. కుమారుడిని తాడుకు వేలాడతీసి, కుమార్తెను బెత్తంతో చావబాదాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని రాజసమంద్ జిల్లా ఫుకియాథడ్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. 
 
రాజసమండ్‌కు చెందిన చైన్ సింగ్(32)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు, మరో చిన్నారి ఉంది. అయితే కుమారుడు, కూతురు బట్టలు మురికి చేస్తున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. 
 
విషయం బాలల సంక్షేమ సమితి అధికారులకు ఇరుగు పొరుగువారి ద్వారా చేరింది. దీంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా వాస్తవాలు వెలుగుచూశాయి. బాధిత చిన్నారులను ప్రశ్నించగా తమ తండ్రి(చైన్ సింగ్ రావత్) తరచూ చావగొడుతుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు చైన్‌సింగ్... కొడుకు లలిత్‌ను తాడుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడు. అలాగే కుమార్తెను కూడా బెత్తంతో చావగొట్టాడు. ఈ సమయంలో తల్లి పక్కనే ఉన్నప్పటికీ అడ్డుకోలేదు. 
 
కాగా దీనికి సంబంధించిన వీడియోను చైన్‌సింగ్ సోదరుడు బన్నా చిత్రీకరించాడు సమాచారం అందుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద నిందితుడు చైన్‌సింగ్‌ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీరూ ఓసారి తిలకించండి.